Asianet News TeluguAsianet News Telugu

తండ్రి కళ్లముందే యువతిని ఎత్తుకెళ్లిన దుండగులు... కేటీఆర్ పర్యటన వేళ సిరిసిల్లలో కలకలం

సిరిసిల్ల : తండ్రితో కలిసి దేవాలయాలనికి వెళ్లిన యువతిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

First Published Dec 20, 2022, 10:34 AM IST | Last Updated Dec 20, 2022, 10:34 AM IST

సిరిసిల్ల : తండ్రితో కలిసి దేవాలయాలనికి వెళ్లిన యువతిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గుడిలోంచి బయటకు వచ్చిన వెంటనే తండ్రి కళ్లముందే యువతి బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు దుండగులు. మరికొద్దిసేపట్లో మంత్రి కేటీఆర్ ఇవాళ ఈ గ్రామం మీదుగా వెళ్లనుండగా యువతి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది.  చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన శాలిని(18) ఇవాళ తెల్లవారుజామున తండ్రి చంద్రయ్యతో కలిసి హనుమాన్ ఆలయానికి వెళ్లింది. పూజలు ముగించుకుని తండ్రి కూతురు గుడిబయటకు రాగా అప్పటికే కారులో కాపుకాసిన కొందరు దుండగులు షాలినిని కిడ్నాప్ చేసారు. చంద్రయ్యపై దాడిచేసి పక్కకు తోసేసిన దుండగులు షాలిని పారిపోతుండగా పట్టుకుని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ కిడ్నాప్ వ్యవహారం సిసి కెమెరాల్లో రికార్డయ్యింది. యువతి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.