Asianet News TeluguAsianet News Telugu

వేములవాడలో హృదయవిదారక ఘటన ... తల్లి కోసం కొడుకు ఆత్మహత్య


వేములవాడ : కన్నతల్లి కోసం ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 

First Published Nov 17, 2022, 3:42 PM IST | Last Updated Nov 17, 2022, 3:42 PM IST


వేములవాడ : కన్నతల్లి కోసం ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. చందుర్తి మండలం అశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరసయ్య-నాగవ్వ దంపతులు మనస్పర్దల కారణంగా విడిపోగా వీరి కొడుకు ప్రశాంత్ తండ్రివద్ద వుంటున్నాడు. నరసయ్యకు దూరమైన నాగవ్వ మరోవివాహం చేసుకుని రెండో భర్తతో వుంటోంది. అయితే ప్రశాంత్ ఇటీవల తల్లివద్దకు వెళ్లి తమతో కలిసి వుండాలని కోరాడు. ఇందుకు తల్లి నాగవ్వ నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన అతడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కొడుకు ఆత్మహత్యకు తల్లే కారణమంటూ నరసయ్య పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.