అమ్మా నాన్న జాగ్రత్త... చెల్లెల్లు క్షమించండిరా..: కన్నీరు పెట్టిస్తున్న యువకుడి సెల్ఫీ వీడియో

సిద్దిపేట : ''అమ్మానాన్న... చెల్లెల్లు... నన్ను క్షమించండి. డ్యాడీ... నేనంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు...

First Published Jul 18, 2022, 10:23 AM IST | Last Updated Jul 18, 2022, 10:23 AM IST

సిద్దిపేట : ''అమ్మానాన్న... చెల్లెల్లు... నన్ను క్షమించండి. డ్యాడీ... నేనంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు... నాకోసం మీరు ఏమైనా చేస్తారు. కానీ తప్పు చెయ్యకుండా నింద భరించడం నావల్ల కావడంలేదు. సొసైటీ డబ్బులు నేను అక్రమంగా వాడుకున్నానని అంటున్నారు. డబ్బులు కట్టకపోతే జైల్లో వేస్తామని... క్రిమినల్ కేసు పెడతారని బెదిరిస్తున్నారు. ఇదే జరిగితే పరువు పోతుంది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. నేను లేకుండా అమ్మ తట్టుకోదు.... డ్యాడీకి నేనంటే ప్రాణం. నేను చనిపోయాక ఆ బాధలో నువ్వు తాగుడుకు బానిస కావద్దు డ్యాడీ. ఇదే నా చివరి కోరిక...జాగ్రత్త డ్యాడీ.... మమ్మీ జాగ్రత్త... చెల్లెల్లు నన్ను క్షమించండిరా...'' అంటూ ఆత్మహత్యకు ముందు ఓ యువకుడు తీసుకున్న సెల్ఫీ వీడియో చూసేవారికి కన్నీరు తెప్పిస్తోంది.  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సొసైటీలో తాత్కాలిక ఉద్యోగి కొప్పు వినయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సొసైటీ డబ్బులను సొంతానికి వాడుకున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తాజాగా బయటపడ్డ అతడి సెల్పీ వీడియో ద్వారా తెలుస్తోంది.