యువకున్ని దుడ్డుకర్రతో చితకబాదుతూ, బూటుకాళ్లతో తంతూ... హైదరాబాద్ పోలీసుల క్రూరత్వం


సికింద్రాబాద్: హైదరాబాద్ లో ప్రెండ్లీ పోలీసింగ్ మాటలకే పరిమితమయ్యింది. 

First Published Jun 6, 2022, 1:43 PM IST | Last Updated Jun 6, 2022, 1:43 PM IST


సికింద్రాబాద్: హైదరాబాద్ లో ప్రెండ్లీ పోలీసింగ్ మాటలకే పరిమితమయ్యింది. సామాన్యులతో పోలీసులు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఘటనే తెలియజేస్తోంది. సికింద్రాబాద్ పరిధిలోని ఓ గల్లీలో జరిగిన చిన్నపాటి గొడవకే ఓ వ్యక్తిని పోలీసులు అత్యంత క్రూరంగా చితకబాదిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.   

మెట్టుగూడకు చెందిన జిమ్ ట్రయినర్ సూర్య ఆరోఖ్యరాజ్ (22) కు బైక్ విషయంలో మరోవ్యక్తితో వివాదం తలెత్తింది. అ గొడవపై ఫిర్యాదు అందడంతో చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు చెందిన నలుగురు కానిస్టేబుళ్లు సూర్య ఇంటికి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడానికి ప్రయత్నించగా ఉదయమే వస్తానని అరోఖ్యరాజ్ తెలిపారు. ఈ విషయంలో పోలీసులకు, సూర్యకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుళ్లు ఓ దుడ్డుకర్రతో కొడుతూ, బూటుకాళ్లతో తంతూ సూర్యను అతి క్రూరంగా చితకబాదారు. ఇలా రోడ్డుపైనే పోలీసులు సూర్యను అమానుషంగా చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.