నడిరోడ్డుపై యువకుల వీరంగం...అందరిముందే ఇద్దరు సోదరులపై కత్తులతో దాడి
జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములపై పాతకక్షలతో రగిలిపోయిన ఓ యువకుడు పదిమంది స్నేహితులతో వచ్చి కత్తులతో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన కోడిమ్యాల మండలం పుడూరు గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేపింది. పుడూరు గ్రామానికి చెందిన భరత్, చరణ్ సోదరులు. వీరికి గిడ్వాన్ అనే యువకుడితో గొడవలున్నాయి. దీంతో సోదరులిద్దరిపై కోపంతో రగిలిపోయిన గిడ్వాన్ నడిరోడ్డుపై కత్తితో వీరంగం సృష్టించాడు. స్నేహితులతో కలిసి అన్నదమ్ములిద్దరిపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ దాడిలో భరత్ కు ఆరు కత్తిపోట్లు దిగడంతో పరిస్థితి సీరియస్ గా వుంది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు సోదరులు జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.