Yadadri News: ఈవో గీతారెడ్డి ఓవరాక్షన్... ఘాట్ రోడ్డులో జర్నలిస్టుల ఆందోళన, అరెస్ట్

యాదగిరిగుట్ట: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సిబ్బంది ఓవరాక్షన్ తో భక్తులే కాదు స్థానికులు, వ్యాపారులు, జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆలయ ఈవో గీతారెడ్డి ప్రతి విషయంలోనూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఆలయ ప్రాంగణంలో మీడియాపై ఆంక్షలు విధించడంలో స్థానిక జర్నలిస్టులు ఇవాళ ఆందోళన చేపట్టారు. ఘాట్ రోడ్డు వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే ఈ అరెస్టులకు నిరసనగా యాదగిరిగుట్ట పీఎస్ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ జర్నలిస్టుల ధర్నాకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం సహా అన్ని పార్టీల లీడర్లు సంఘీభావం తెలిపారు. ఇదిలావుంటే నేడు (మంగళవారం) యాదగిరిగుట్ట బంద్‌కు స్థానికులు, వ్యాపారులు పిలుపునిచ్చారు. ఆలయ ఈఓ నియంతృత్వ దోరణిని నిరసిస్తూ గుట్ట బంద్‌కు పిలుపిచ్చారు. స్థానికులు, వ్యాపారులు. స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. 

First Published Apr 5, 2022, 12:19 PM IST | Last Updated Apr 5, 2022, 12:19 PM IST