త్రివర్ణ పతాకాలు చేతబట్టి... కరీంనగర్ లో ఆకట్టుకున్న మహిళల బైక్ రైడింగ్
కరీంనగర్ : 75 ఏళ్ళ స్వాంతంత్య్ర భారతంలో మహిళా సాధికారిత ఎలా సాగిందో తెలియజేసే అద్భతం కరీంనగర్ లో ఆవిష్కృతమయ్యింది.
కరీంనగర్ : 75 ఏళ్ళ స్వాంతంత్య్ర భారతంలో మహిళా సాధికారిత ఎలా సాగిందో తెలియజేసే అద్భతం కరీంనగర్ లో ఆవిష్కృతమయ్యింది. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా కరీంనగర్ లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆందులో సాంప్రదాయ వేషధానణలో మహిళలు బైక్ నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. పురుషులకు దీటుగా త్రివర్ణ పతాకాలు చేతబట్టి బైక్ ను రయ్ రయ్ మంటూ పోనిచ్చారు మగువలు. ర్యాలీగా తెలంగాణ చౌక్ వరకు వెళ్ళిన మహిళలు దేశభక్తి పాటలపై నృత్యాలు చేసారు.