Asianet News TeluguAsianet News Telugu

అంగరంగవైభవంగా పూలపండగ... హైదరాబాద్ మహిళా పోలీసుల బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్ :  తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

First Published Sep 27, 2022, 12:46 PM IST | Last Updated Sep 27, 2022, 12:46 PM IST

హైదరాబాద్ :  తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఆడబిడ్డలు జరుపుకునే ఈ పూలపండగ కోసం ప్రభుత్వం కూడా అన్నిఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పనిచేసే దాదాపు 1200మంది మహిళా పోలీసులు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పోలీసులంతా కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. సిపి సివి ఆనంద్ కూడా సతీసమేతంగా ఈ బతుకమ్మ సంబరాలకు విచ్చేసి జ్యోతిప్రజ్వలన, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇలా మహిళా పోలీసులంతా బతుకమ్మ ఆడుతూ ఆనందంగా గడిపారు.