Asianet News TeluguAsianet News Telugu

ప్రాణాలమీదకు తెచ్చిన వెయిట్ లాస్ ట్రీట్మెంట్.. హాస్పిటల్ పాలైన మహిళ

హైదరాబాద్ :బరువు తగ్గేందుకు ప్రయత్నించి ఓ మహిళ ప్రాణాలమీదకు తెచ్చుకుంది.

First Published Apr 23, 2023, 11:58 AM IST | Last Updated Apr 23, 2023, 11:58 AM IST

హైదరాబాద్ :బరువు తగ్గేందుకు ప్రయత్నించి ఓ మహిళ ప్రాణాలమీదకు తెచ్చుకుంది. వెయిట్ లాస్ థెరపీ అంటూ ఎలక్ట్రిక్ వైబ్రేటర్ తో ట్రీట్మెంట్ ఇవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురయిన మహిళ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. 

సికింద్రాబాద్ కార్ఖానాలో ప్రైవేట్ ఉద్యోగ్ అశోక్ భార్య మహేశ్వరి(30) వెయిట్ లాస్ కోసం కలర్స్ సంస్థను ఆశ్రయించింది. 81 కిలోల బరువున్న ఆమెను 15 కేజీలు తగ్గిస్తామంటూ రూ.40వేల ప్యాకేజీ మాట్లాడుకుంది ఈ సంస్ధ. కొంత డబ్బు చెల్లించడంతో ఆమెకు ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వైబ్రేటర్ తో మసాజ్ చేయడంతో మహేశ్వరి తీవ్ర అస్వస్థతకు గురయ్యింది.దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. మహేశ్వరిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన కలర్స్ సంస్థపై కుటుంబసభ్యులు కార్ఖానా పోలీసులకు పిర్యాదు చేసారు.