ఈ ధీర వనిత దొంగను ఎంత ధైర్యంగా ఎదిరించిందో చూడండి..!

సిరిసిల్ల : ఇంట్లో దోపిడీకి వచ్చిన ఓ దొంగను అత్యంత ధైర్యంగా ఎదుర్కొని మహిళాశక్తిని చాటిచెప్పిందో మహిళ. 

First Published Aug 14, 2023, 6:05 PM IST | Last Updated Aug 14, 2023, 6:05 PM IST

సిరిసిల్ల : ఇంట్లో దోపిడీకి వచ్చిన ఓ దొంగను అత్యంత ధైర్యంగా ఎదుర్కొని మహిళాశక్తిని చాటిచెప్పిందో మహిళ. సిరిసిల్లకు చెందిన ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా వుండగా దొంగతనానికి యత్నించాడో దొంగ. ఇంటి కాలింగ్ బెల్ కొట్టడంతో మహిళ తలుపుతీసి బయటకురాగా ఆమెపై దాడికి ప్రయత్నించాడు దొంగ. వెంటనే అలర్ట్ అయిన ఆమె వాడి చేతిలోని ఆయుధాన్ని పట్టుకుని దైర్యంగా ఎదిరించింది. కొద్దిసేపు పెనుగులాట తర్వాత ఆ దొంగోడు అక్కడినుండి పరారయ్యాడు. మహిళ దొంగను అడ్డుకున్న దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. ఆమె ధైర్యానికి అందరూ మెచ్చుకుంటున్నారు.