కరీంనగర్ : కొడుకు తీసుకున్న అధిక వడ్డీల అప్పులకు తల్లి బలయిన ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రాజకీయ నాయకుడి వద్ద బాధిత మహిళ కొడుకు అప్పు తీసుకుని సకాలంలో చెల్లించలేకపోయాడు. దీంతో సదరు మహిళ అన్నా అంటూ అప్పిచ్చిన వ్యక్తిని సముదాయించే ప్రయత్నంచేసిన అతడు అమ్మనాబూతులు తిట్టాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధిత మహిళ, ఆమె కొడుకును అప్పిచ్చిన వ్యక్తి బూతులు తిడుతున్న ఫోన్ రికార్డింగ్స్ బయటకు వచ్చాయి.