రామగుండంలో దారుణం ... తాగుబోతు భర్తను ఇటుకతో కొట్టిచంపిన మహిళ

పెద్దపల్లి : తాగుబోతు భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ దారుణ నిర్ణయం తీసుకుంది.

First Published Oct 21, 2022, 2:01 PM IST | Last Updated Oct 21, 2022, 2:01 PM IST

పెద్దపల్లి : తాగుబోతు భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ దారుణ నిర్ణయం తీసుకుంది. మద్యం మత్తులో ఇంటకొచ్చిన భర్త అకారణంగా చితకబాదుతుంటే సహనం కోల్పోయి ఎదురుతిరిగిన భార్య ఇటుక రాయితో మోది హతమార్చింది. ఈ దారుణం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.  చిలుముల సుమన్, స్పందన దంపతులు రామగుండం ఎల్కలపల్లి గేటు ప్రాంతానికి నివాసముండేవారు. ఆటో డ్రైవర్ గా పనిచేసే సుమన్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి ఇంటికివచ్చి భార్యతో గొడవపడేవాడు. ఇలా నిత్యం నరకం చూపిస్తున్న భర్త వికృతచేష్టలను స్పందన భరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున బార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తనను చితకబాదుతున్న భర్తకు ఎదురుతిరిగిన స్పందన ఇటుకరాయితో తలపై బాదింది. దీంతో అతడు అక్కడే రక్తపుమడుగులో పడి మృతిచెందాడు.