కేంద్రంపై కేరళ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి పోరాటం..: మంత్రి ఎర్రబెల్లి వెల్లడి
హైదరాబాద్ : ఉపాధి హామీ పథకం రద్దుకు కేంద్రం కుట్రలు చేస్తోందని...
హైదరాబాద్ : ఉపాధి హామీ పథకం రద్దుకు కేంద్రం కుట్రలు చేస్తోందని... ఇందులో భాగంగానే కఠిన నియమాలతో రాష్ట్రాలను వేధిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. ఇలా ఉపాధి హామీపై కేంద్ర నిరంకుశ వైఖరికి నిరసనగా జాతీయ స్థాయిలో రాష్ట్రాల సమిష్టి పోరాటాని సిద్దమవుతున్నాయన్నారు. ఇప్పటికే కేంద్రంపై కేరళ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి పోరాటానికి సిద్దమయ్యామన్నారు. ఇతర రాష్ట్రాలనై కలుపుకుని కేంద్రంపై పోరాడతామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు - సవాళ్లు అనే అంశంపై హైదరాబాద్ రవీంద్ర భారతిలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కేరళ మంత్రి ఎంబి రాజేష్ హాజరయ్యారు.