గిఫ్ట్ ఎ స్మైల్.. అంబులెన్స్ లను ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి..
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జులైలో జరిగిన తన పుట్టినరోజు సంధర్భంగా ఇచ్చిన ‘గిఫ్ట్ ఎ స్మైల్’ పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జులైలో జరిగిన తన పుట్టినరోజు సంధర్భంగా ఇచ్చిన ‘గిఫ్ట్ ఎ స్మైల్’ పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగా సొంతంగా తయారు చేయించిన రెండు అంబులెన్స్ లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం మూడు అంబులెన్స్ లకు గాను గతంలో ఒకటి వనపర్తి జిల్లా ఆసుపత్రికి కేటాయించారు. ఇప్పుడు ఈ రెండింటినీ వనపర్తి జిల్లాకే కేటాయించారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ తో కూడిన అధునాతన అంబులెన్స్ లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, అత్యవసర సమయాలలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఇవి ఉపయోగపడతాయని అన్నారు.