Asianet News TeluguAsianet News Telugu

గ్రామానికి కీడు సోకిందని.. ఊరు ఖాళీ చేసిన గ్రామస్తులు..

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లి గ్రామంలో ఈ మధ్య వరసగా నలుగురు అనారోగ్యంతో మృతి చెందారు. 

First Published Sep 16, 2022, 11:06 AM IST | Last Updated Sep 16, 2022, 11:06 AM IST

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లి గ్రామంలో ఈ మధ్య వరసగా నలుగురు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో గ్రామానికి మంచి జరుగడం లేదని ఓ పండితున్ని ఆశ్రయించారు గ్రామస్థులు. గ్రామానికి కీడు సోకిందని గ్రామం మొత్తం ఖాళీ చేసి ఒక్క రోజు మొత్తం గ్రామం బయటికి వంటలకు వెళ్ళాలని ఆ పండితుడు సలహా ఇచ్చాడు. దీంతో గ్రామస్థులు గ్రామం మొత్తం ఖాళీ చేసి ఊరిబయట వంటలకు వెళ్లారు. అయితే  ఈ మూఢ నమ్మకాలపై అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు.