Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయిపై చెప్పులతో దాడి... మానుకొండూరులో ఉద్రిక్తత

కరీంనగర్ జిల్లా మానుకొండూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్ పై కొందరు ఆందోళనకారులు చెప్పులు, రాళ్లు విసరగా వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేసారు.

First Published Nov 13, 2022, 2:11 PM IST | Last Updated Nov 13, 2022, 2:11 PM IST

కరీంనగర్ జిల్లా మానుకొండూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్ పై కొందరు ఆందోళనకారులు చెప్పులు, రాళ్లు విసరగా వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేసారు. దీంతో గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. గుండ్లపల్లి నుండి గన్నేరువరం, పొత్తూరు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కొందరు యువకులు, స్థానికులు రాజీవ్ రహదారిపై ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే రసమయి క్యాంప్ కార్యాలయం నుండి బెజ్జంకి వైపు వెళుతూ ఈ ధర్నా ప్రాంతానికి వచ్చారు. ఎమ్మెల్యేను చూడగానే ఒక్కసారిగా ఆగ్రహానికి గురయిన యువకులు కొందరు కాన్వాయ్ పై రాళ్లు, చెప్పులు విసిరారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ కు దిగి చెదరగొట్టారు.