టీఆర్ఎస్ కు షాక్... ఈటలకు మద్దతుగా మరికొందరు రాజీనామా
కరీంనగర్: ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుండి ఆయన నియోజకవర్గం హుజురాబాద్ టీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు రాజీనామా చేయడం ప్రారంభించారు.
కరీంనగర్: ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుండి ఆయన నియోజకవర్గం హుజురాబాద్ టీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు రాజీనామా చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇవాళ వీణవంక మండలంలో భారీగా టిఆర్ఎస్ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. ఈటల వెంటే మేము ఉంటామని రాజీనామా చేసిన ప్రజా ప్రతినిధులతో పాటు నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీని వీడిన వారిలో వీణవంక టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మారుముళ్ల కొమురయ్య, వైస్ ఎంపీపీ రాయశెట్టి లత తో పాటు పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు. రైతు సమన్వయ సమితి సభ్యులు వున్నారు.