నీ అప్పుల బాధ్యత నాదే..: మహిళా ఎంపీపీకి ఈటల హామీ
హుజురాబాద్: టీఆర్ఎస్ నాయకుల ఒత్తిడికి తలొగ్గకుండా తనకు మద్దతుగా నిలిచిన వీణవంక ఎంపిపి రేణుక కుటుంబానికి మాజీ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కూడా అండగా నిలిచారు.
హుజురాబాద్: టీఆర్ఎస్ నాయకుల ఒత్తిడికి తలొగ్గకుండా తనకు మద్దతుగా నిలిచిన వీణవంక ఎంపిపి రేణుక కుటుంబానికి మాజీ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కూడా అండగా నిలిచారు. వారి యాజమాన్యంలో నడుస్తున్న స్కూల్స్ ఆర్థిక ఇబ్బందుల్లో వుందని తెలుసుకున్న మంత్రి... అప్పుల బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
తనను కలవడానికి వచ్చిన ఎంపిపి రేణుక భర్త తిరుపతి రెడ్డికి మంత్రి భరోసా ఇచ్చారు. ''తిరుపతి రెడ్డి నేను హామీ ఇస్తున్నాను. నీ స్కూల్కు ఎన్ని అప్పులు ఉన్న నేనే చెల్లిస్తాను. ట్రస్మా లో రెండు రకాలు ఉన్నారు. ఒకటి మనకు అనుకూలంగా ఉంది. నీ స్కూల్ అప్పుల బాధ్యత నాది'' అని ఈటల అన్నారు.