Asianet News TeluguAsianet News Telugu

శ్రీధర్ బాబుకు ఆ పదవి నేను పెట్టిన బిక్షే: వామనరావు ఆడియో వైరల్

మంథని: ఇటీవల ప్రత్యర్థుల చేతిలో అత్యంత కిరాతకంగా హతమార్చబడ్డారు హైకోర్టు అడ్వకేట్ దంపతులు గట్టు వామనరావు‌-నాగమణి. 

First Published Feb 28, 2021, 12:07 PM IST | Last Updated Feb 28, 2021, 12:07 PM IST

మంథని: ఇటీవల ప్రత్యర్థుల చేతిలో అత్యంత కిరాతకంగా హతమార్చబడ్డారు హైకోర్టు అడ్వకేట్ దంపతులు గట్టు వామనరావు‌-నాగమణి. ఈ హత్యలో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు హస్తం వున్నట్లు ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా వామనరావు ఎమ్మెల్యే  శ్రీధర్ బాబును తిడుతున్న ఓ పోన్ కాల్ ఆడియో వైరల్‌గా మారింది.  తనను శ్రీధర్ బాబు అవమానపర్చాడని వేరే వ్యక్తితో వామన్ రావు మాట్లాడుతున్న ఆడియో లీక్ అయింది. ''వానికి నీతి లేదు (శ్రీధర్ బాబుకు).. శరణు శరణు అంటూ శ్రీధర్ బాబు వేడుకున్నాడని, ఆయనకు ఆ పదవి తాను పెట్టిన బిక్షే'' అంటూ వామన్ రావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.