Asianet News TeluguAsianet News Telugu

ధరణి రాకతో రైతుల ఆత్మహత్యలు...ఆ కుంభకోణాలకూ కారణమిదే: కిషన్ రెడ్డి సంచలనం

హైదరాబాద్ : అధికార అండతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, శిఖం భూములు, పార్కులనే కాదు కేంద్ర ప్రభుత్వ భూములను యధేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 

First Published Sep 26, 2022, 3:18 PM IST | Last Updated Sep 26, 2022, 3:18 PM IST

హైదరాబాద్ : అధికార అండతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, శిఖం భూములు, పార్కులనే కాదు కేంద్ర ప్రభుత్వ భూములను యధేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. చివరకు అన్ని అనుమతులతో ఇళ్లు కట్టుకుంటున్న సామాన్యులపై సైతం  గులాబి దండు గూండాయిజం చేస్తోందని కేంద్ర మంత్రి ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ తెలంగాణ ప్రజలను నయవంచన చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. అన్ని విషయాల్లోనూ ప్రజలను మభ్య పెట్టేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇంట్లో ఈగల మోత - బయట పల్లకిల మోతగా టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రచారం వుందన్నారు. ధరణి తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు వుందన్నారు. రైతుల ఆత్మహత్యలతో పాటు అనేక కుంభకోణాలు ధరణి కారణమవుతోందని... గ్రామాల నుండి హైదరాబాద్, విదేశాలకు వెళ్లే వారి భూములను ధరణి ద్వారా ఆక్రమించుకునే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ధరణి ద్వారా తమకు అన్యాయం జరిగిందని నాలుగు లక్షల మంది రైతులు వాపోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.