యునెస్కో వారసత్వ కేంద్ర డైరెక్టర్ నోట తెలుగు పలుకులు...
హైదరాబాద్ : తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో గల చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.
హైదరాబాద్ : తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో గల చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఈ సందర్భంగా యునెస్కో వారసత్వ కేంద్రం డైరెక్టర్ శ్రీ లాజర్ ఎలౌండౌ భారత ప్రజలకు తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు. ''ప్రపంచ వారసత్వ జాబితాలో రుద్రేశ్వర రామప్ప ఆలయం చేరిన సందర్భ భారత దేశ ప్రజలకు అభినందనలు'' అంటూ అచ్చతెలుగులో మాట్లాడిన వీడియోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు.