చిప్ప పట్టుకుని బిచ్చమెత్తుకుంటూ... మెట్రో రైల్లో నిరుద్యోగుల వినూత్న నిరసన

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని భావించిన తమకు కేసీఆర్ కుటుంబ పాలనలో తీవ్ర అన్యాయం జరిగిందంటూ హైదరాబాద్ లో నిరుద్యోగ యువత వినూత్న నిరసన తెలిపారు. 

First Published Dec 19, 2022, 12:50 PM IST | Last Updated Dec 19, 2022, 12:50 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని భావించిన తమకు కేసీఆర్ కుటుంబ పాలనలో తీవ్ర అన్యాయం జరిగిందంటూ హైదరాబాద్ లో నిరుద్యోగ యువత వినూత్న నిరసన తెలిపారు. డిగ్రీలు, పీజిలు చేసిన తాము ఉద్యోగాలు లేక అడుక్కుతినే పరిస్థితి వచ్చిందంటూ హైదరాబాద్ మెట్రోలో కొందరు యువకులు చిప్పపట్టుకుని బిచ్చమెత్తుతూ నిరసన తెలిపారు. 
ఈ ఎనిమిదేళ్లలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడంతో వయోపరిమితి దాటిపోయి తాము అనర్హులుగా మారామని... తమలాగే చాలామంది ఉద్యోగాలు పొందలేని పరిస్థితిలో వున్నారని యువకులు వాపోయారు. తమకు తోచిన దానం చేసి ఆదుకొండి అంటూ డిగ్రీలు పొందే సమయంలో ధరించే నల్లటి కోటు, టోపీ ధరించి, చేతిలో చిప్ప పట్టుకుని మెట్రో ప్రయాణికులను అడుక్కున్నారు నిరుద్యోగ యువత.