Asianet News TeluguAsianet News Telugu

విషాదం... నీటిసంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి

కరీంనగర్ : ఇంటిబయట ఆడుకుంటూ నీటిసంపులో ముక్కుపచ్చలారని చిన్నారి మృతిచెందిన విషాద ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

First Published Nov 6, 2022, 12:48 PM IST | Last Updated Nov 6, 2022, 12:48 PM IST

కరీంనగర్ : ఇంటిబయట ఆడుకుంటూ నీటిసంపులో ముక్కుపచ్చలారని చిన్నారి మృతిచెందిన విషాద ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మానుకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ గ్రామానికి చెందిన బోయిని పుష్పలత - నవీన్ దంపతులకు ఒక్కతే కూతురు. రెండేళ్ల చిన్నారి ఆరాధ్య ఇంటిబయట ఆడుకుంటూ వెళ్లి నీటిసంపులో పడిపోయింది. ఇది ఎవ్వరూ గమనించకపోవడంతో నీటమునిగి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ కుటుంబంలోనే కాదు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.  

Video Top Stories