పెన్ గంగ ప్రాజెక్ట్ కాలువలో పెద్దపులులు... ఆదిలాబాద్ జిల్లాలో భయం భయం

ఆదిలాబాద్ : పెద్దపులుల సంచారం ఆదిలాబాద్ జిల్లాలో భయాందోళన సృష్టిస్తోంది.

First Published Nov 8, 2022, 3:35 PM IST | Last Updated Nov 8, 2022, 3:35 PM IST

ఆదిలాబాద్ : పెద్దపులుల సంచారం ఆదిలాబాద్ జిల్లాలో భయాందోళన సృష్టిస్తోంది. కొందరికి జైనత్ మండలంలోని గూడ గ్రామ శివారులోని పెన్ గంగ కాలువలో రెండు పులులు కనిపించాయి. పులుల సంచారాన్ని వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పెట్టడంలో వైరల్ గా మారింది. ఇలా పెద్దపులుల సంచారిస్తున్న విషయం అంతటా ప్రచారం కావడంతో ఆదిలాబాద్ ప్రజలు భయాందోళను గురవుతున్నారు. 

పెన్ గంగ ప్రాజెక్ట్ అధికారులు పులుల సంచారానికి సంబంధించిన సమాచారం అటవీశాఖ అధికారులు అదించారు. దీంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు పులులను పట్టుకుని జనావాసాలకు దూరంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండుపులులు మహారాష్ట్రలోని తిప్పేశ్వరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి చెందినవిగా అనుమానిస్తున్నారు. పెద్దపులుల సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని అటవీ అదికారులు స్థానికులను హెచ్చరిస్తున్నారు.