గర్భిణిని కాపాడబోయి వరదల్లో కొట్టుకుపోయి... సింగరేణి రెస్క్యూ టీం సభ్యులు గల్లంతు
ఆదిలాబాద్ : భారీ వరదనీటిలో చిక్కుకున్న నిండు గర్భిణిని కాపాడేందుకు ప్రయత్నించి ఇద్దరు సింగరేణి రెస్క్యూ టీం సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
ఆదిలాబాద్ : భారీ వరదనీటిలో చిక్కుకున్న నిండు గర్భిణిని కాపాడేందుకు ప్రయత్నించి ఇద్దరు సింగరేణి రెస్క్యూ టీం సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లాలోని పెద్దవాగు భారీ వరద నీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తూ కొన్ని గ్రామాలను ముంచెత్తగా మరికొన్ని గ్రామాలకు రాకపోకలు లేకుండా చేసింది. ఇలా దహెగాం మండలాన్ని వరద నీరు చుట్టుముట్టగా ఇదే సమయంలో బీబ్రా గ్రామానికి చెందిన సరస్వతి అనే గర్భిణి పురిటినొప్పులతో బాధపడింది. అయితే పెద్దవాగు ఉధృతి కారణంగా ఎక్కడికీ తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయితే గర్భిణిని సింగరేణి రెస్క్యూ టీం వాగు దాటించేందుకు ప్రయత్నించగా బృందంలోని ఇద్దరు సభ్యులు నీటిలో కొట్టుకుపోయారు. ఇలా పెద్దవాగులో గల్లంతయిన రెస్క్యూ టీం సభ్యులుమంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన రాము, సతీష్ గా గుర్తించారు. వీరి మృతదేహాలు గురువారం ఉదయం లభ్యమయ్యాయి.