Karimnagar Road Accident:రాజీవ్ రహదారిపై ట్రాక్టర్-కారు ఢీ... ఇద్దరి పరిస్థితి విషమం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తున్న ఇసుక లోడ్ తో వెలుతున్న ట్రాక్టర్ ను హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎల్ఎండి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు . గాయపడ్డ వారు కరీంనగర్ వాసులుగా తెలుస్తోంది. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమైంది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. కారు వేగంగా ఢీ కొట్టడంతో ముందు బాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనపై ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు.