బావిలో మునిగి ఇద్దరు అన్నదాతలు దుర్మరణం... గుండెలవిసేలా రోదిస్తున్న కుటుంబసభ్యులు
జగిత్యాల : వ్యవసాయ పనుల్లో భాగంగా బావిలో దిగిన ఇద్దరు రైతులు నీటమునిగి మృత్యువాతపడిన విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
జగిత్యాల : వ్యవసాయ పనుల్లో భాగంగా బావిలో దిగిన ఇద్దరు రైతులు నీటమునిగి మృత్యువాతపడిన విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ధర్మపురి పట్టణ శివారులోని వ్యవసాయ బావిలో మోటార్ నీటమునగడంతో బయటకు తీయడానికి శ్రీనివాస్, వెంకటేష్ దిగారు.అయితే ఒక్కసారిగా వారిద్దరు బావిలో జారిపడి నీటిలో ఊపిరాడక మృతిచెందారు. మృతుల్లో ఒకరు ధర్మపురి, మరొకరు కమలాపూర్ కు చెందినవారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ళ సాయంతో ఇద్దరి మృతదేహాలను బావిలోంచి బయటకు తీసారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతులిద్దరి మృతితో రెండు కుటుంబాల్లోనే కాదు ధర్మపురి, కమలాపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నారు.