Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో ఘోరం... మంటలు చెలరేగి రెండు బస్సులు దగ్దం

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 

First Published Nov 21, 2022, 10:00 AM IST | Last Updated Nov 21, 2022, 10:00 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బహదూర్ పురా పరిధిలోని ఎన్ఎం గూడ అంబేద్కర్ విగ్రహం వద్ద రాత్రి పార్కింగ్ చేసిన బస్సుల్లో మంటలు చెలరేగాయి. మొదట ఓ బస్సుకు మంటలు అంటుకుని మరో బస్సుకు వ్యాపించాయి. మంటలను గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి  సమాచారమివ్వగా వారు ఘటనాస్థలికి చేరుకునేసరికే ఓ బస్సు పూర్తిగా దగ్దమయ్యాయి. మరో బస్సు పాక్షికంగా దగ్దమవగా రెండు ఫైరింజన్లు మంటలు అదుపుచేసారు. షాట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సులు దగ్దం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.