మెడికల్ కాలేజ్ ప్రారంభ వేడుకలో అపశృతి ... ఒళ్లంతా మంటలతో టీఆర్ఎస్ కార్యకర్త విలవిల
సంగారెడ్డి : రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు జరిపిన సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది.
సంగారెడ్డి : రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు జరిపిన సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. బైక్ ర్యాలీ సందర్భంగా ఓ ఆటోలో తరలిస్తున్న టపాసులకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని భారీపేలుడు సంబవించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే ఒకరు స్వల్పంగా గాయపడగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణలోని ఎనిమిది జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఇలా సంగారెడ్డి జిల్లాలోనూ కాలేజీని ప్రారంభించిన నేపథ్యంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే టపాకాయలు తరలిస్తున్న ఆటోలో నిప్పురవ్వలు పడి అన్నీ ఒకేసారి పేలాయి. దీంతో ఓ వ్యక్తి ఈ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు. టీఆర్ఎస్ కార్యకర్తలు మంటల్లో చిక్కుకున్న వ్యక్తిని అతికష్టం మీద కాపాడి హాస్పిటల్ తరలించారు. అతడి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.