Asianet News TeluguAsianet News Telugu

ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడి...

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కూతురు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసాడంటూ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ శ్రేణులు పిచ్చికోపంతో వున్నారు. 

First Published Nov 18, 2022, 3:21 PM IST | Last Updated Nov 18, 2022, 3:21 PM IST

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కూతురు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసాడంటూ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ శ్రేణులు పిచ్చికోపంతో వున్నారు. తమ నాయకులపై అరవింద్ చేసిన కామెంట్స్ తో ఆగ్రహించిన టీఆర్ఎస్ శ్రేణులు ఇవాళ హైదరాబాద్ లోని ఆయన ఇంటిపై దాడిచేసారు. ఒక్కసారిగా అరవింద్ ఇంటివద్దకు టీఆర్ఎస్ జెండాలతో కూడిన కర్రలతో వచ్చిన కార్యకర్తలు దాడికి దిగారు. అరవింద్ ఇంటి ఆవరణలోని పూలకుండీలు, ఫర్నీచర్ ధ్వంసం చేసారు. దాడిని గుర్తించిన ఎంపీ కుటుంబసభ్యులు లోపలినుండి తలుపులు పెట్టుకోగా కిటికీ అద్దాలను రాళ్లు విసిరారు. దీంతో అద్దాలు పగిలి రాళ్లు లోపలికి చొచ్చుకెళ్లి ఇంట్లోని వస్తువులూ ధ్వంసమయ్యాయి. ఇలా కొద్దిసేపు అరవింద్ ఇంటివద్ద టీఆర్ఎస్ శ్రేణులు నానా బీభత్సం సృష్టించారు. ఈ దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.