టీఆర్ఎస్ జెండా చేతబట్టి, బస్ టాప్ ఎక్కి... పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన మంత్రి గంగుల
కరీంనగర్ : పెద్దపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్న బహిరంగ సభను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
కరీంనగర్ : పెద్దపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్న బహిరంగ సభను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి భారీగా జనసమీకరణ చేపట్టారు. ఆర్టిసి బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలను కూడా ప్రజలను పెద్దపల్లికి తరలించేందుకు ఏర్పాటు చేసారు. ఇలా కరీంనగర్ నుండి పెద్దపల్లికి ఏర్పాటుచేసిన ఓ ఆర్టిసి బస్సును మంత్రి గంగుల కమలాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జెండా పట్టుకుని బస్సు టాప్ పైకి ఎక్కి కూర్చున్న మంత్రి గంగుల, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేసారు.