కేంద్రం తానాషాహీ నహీ చలేగా...: జీఎస్టి బాదుడుపై టీఆర్ఎస్ ఆందోళనలు
ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు సతమతం అవుతుంతే నిత్యావసర ధరలపై జీఎస్టీ పెంచి కేంద్ర మరింత భారం మోపిందని ఆరోపిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది.
ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు సతమతం అవుతుంతే నిత్యావసర ధరలపై జీఎస్టీ పెంచి కేంద్ర మరింత భారం మోపిందని ఆరోపిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా నేడు (బుధవారం) ఆందోళనలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్సింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. దీంతో పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఇక హైదరాబాద్ లోనూ టీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. ఖైరతాబాద్ నియోజకవర్గం ఫిల్మ్ నగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరిలో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలు, రైతులు, ఇతర ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.