Telangana News:నల్లజెండాలు చేతబట్టి... భారీ బైక్ ర్యాలీల్లో పాల్గొన్న మంత్రులు ఆలోల్ల, పువ్వాడ

తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ అధికార టీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. 

First Published Apr 8, 2022, 3:59 PM IST | Last Updated Apr 8, 2022, 3:59 PM IST

తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ అధికార టీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలంతా అదిష్టానం పిలుపుమేరకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇవాళ(శుక్రవారం) టీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీలు తలపెట్టాయి.  నిర్మల్ పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి ఇంద్రకరణ్ పాల్గొన్నారు. మెడలొ టీఆర్ఎస్ కండువా, చేతిలో నల్ల జెండా పట్టుకుని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ అధ్వర్యంలో చేపట్టిన మోటర్ సైకిల్ ర్యాలీలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని నిరసన వ్యక్తం చేసారు. మరో మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ లోని తన ఇంటిపై నల్ల జెండా ఎగరేసారు.