సాంప్రదాయ వ్యవసాయంతో ఐకార్ అవార్డ్... వెతుక్కుంటూ వచ్చిన ఎమ్మెల్సీ కవిత

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ఇంటికి వెళ్లారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.

First Published Feb 26, 2021, 4:30 PM IST | Last Updated Feb 26, 2021, 4:30 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ఇంటికి వెళ్లారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సాంప్రదాయ పద్దతిలో వ్యవసాయం చేస్తూ ఐకార్ అవార్టు పొందిన మల్లిఖార్జున్ రెడ్డి దంపతుల ఇంటికి ప్రణాళిక సంఘ ఉపాధ్యాక్షులు వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ తో కలిసివెళ్ళి అభినందించారు ఎమ్మెల్సీ కవిత. 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... మనం తినే తిండి బలంగా ఉండాల్సిన అవసరం వుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. రసాయన ఎరువులతో కూడిన అహారం కాకుండా సాంప్రదాయ, సమీకృత పద్ధతిలో పంట పండిస్తున్న మల్లిఖార్జున్ ఆదర్శంగా నిలిచారన్నారు.