Asianet News TeluguAsianet News Telugu

చిన్నారులను కారులో ఎక్కించుకుని... సరదాగా ముచ్చటిస్తూ గమ్యంచేర్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

కరీంనగర్ : రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయుడిగా పనిచేయడం వల్లేనేమో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విద్యార్థులపై ప్రత్యేక ప్రేమను ప్రదర్శిస్తుంటారు. 

First Published Dec 19, 2022, 5:21 PM IST | Last Updated Dec 19, 2022, 5:21 PM IST

కరీంనగర్ : రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయుడిగా పనిచేయడం వల్లేనేమో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విద్యార్థులపై ప్రత్యేక ప్రేమను ప్రదర్శిస్తుంటారు. ముఖ్యంగా తన నియోజకవర్గం చొప్పదండి పరిధిలోని ప్రభుత్వ పాఠశాలు, అందులో చదువుకునే విద్యార్థులకు ఏ సమస్యా  లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి టీచర్ అవతారమెత్తి తెలుగు పాఠాలు బోధించిన ఎమ్మెల్యే తాజాగా విద్యార్థుల కష్టాన్ని చూసి చలించిపోయారు. ఎమ్మెల్యే తన కారులో వెళుతుండగా గంగాధర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఓ షేరింగ్ ఆటోలో పరిమితికి మించి ప్రమాదకరంగా ప్రయాణించడం గమనించారు. దీంతో వెంటనే ఆటోను ఆపి అందులోంచి కొందరు చిన్నారులను తన కారులో ఎక్కించుకుని  వారితో సరదాగా ముచ్చటిస్తూ ఇంటికి చేర్చారు. తన బిజీ షెడ్యూల్ ను కూడా పక్కనబెట్టి విద్యార్థులపై ప్రేమతో ఎమ్మెల్యే రవిశంకర్ చేసిన పని రాజకీయ ప్రత్యర్థుల నుండి సైతం ప్రశంసలు పొందేలా వుంది.