వరినాట్లు వేసే కూలీలతో సరదాగా ముచ్చటించిన ఎమ్మెల్యే రవింశంకర్...

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి.

First Published Dec 21, 2022, 4:15 PM IST | Last Updated Dec 21, 2022, 4:15 PM IST

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం కూడా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ఏమాత్ర తీసిపోవడం లేదు. ఇప్పటికే సెస్ ఎన్నికల ప్రచారం కోసం అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రజాక్షేత్రంలోకి దిగారు. ఇలా చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలోనే అనంతపల్లి గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో కొందరు మహిళలు పొలంలొ నాట్లు వేస్తూ కనిపించడంతో కారు ఆపి వారితో సరదాగా ముచ్చటించారు ఎమ్మెల్యే. 

సెస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గుర్తేదో ఎమ్మెల్యే అడగ్గా బ్యాట్ గుర్తని మహిళలు చెప్పారు. దీంతో తనను గెలిపించుకున్నట్లే బ్యాట్ గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించాలని రవిశంకర్ సూచించారు. కొత్త ఫించన్లు వస్తున్నాయో లేదో అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రవిశంకర్ బిడి కార్మికులు ఎవరైనా వుంటే ఫించన్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.