కొండగట్టుకు ఎమ్మెల్సీ కవిత... టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
జగిత్యాల: చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు ప్రమాదం తప్పింది.
జగిత్యాల: చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు ప్రమాదం తప్పింది. గురువారం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ లు కొండగట్టు అంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి అంజనేయస్వామిని దర్శించుకున్న తర్వాత జగిత్యాల వైపు వెళుతుండగా ఆయన కారు ప్రమాదానికి లోనయ్యింది. కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టింది. అయితే ఈ సమయంలో ఎమ్మెల్యే రవిశంకర్ ఎమ్మెల్సీ కవిత కారులో ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు.