Asianet News TeluguAsianet News Telugu

అపచారం... ఖైరతాబాద్ గణపయ్యను చెప్పులతోనే పూజించిన దానం నాగేందర్

హైదరాబాద్ : భక్తులు ఎంతో భక్తితో కొలిచే గణనాథుడికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పులతో పూజించడం వివాదాస్పందంగా మారింది. =

First Published Sep 8, 2022, 3:43 PM IST | Last Updated Sep 8, 2022, 3:43 PM IST

హైదరాబాద్ : భక్తులు ఎంతో భక్తితో కొలిచే గణనాథుడికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పులతో పూజించడం వివాదాస్పందంగా మారింది. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ లో ఏర్పాటుచేసిన మహాగణపతిని ఇటీవల సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా గణనాథుడి పూజలో పాల్గొన్నారు. ఇలా గణపయ్య పూజ సమయంలో తీసిన ఫోటోలను కవిత సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇందులో దానం నాగేందర్ చెప్పులు వేసుకునే మహాగణపతిని పూజిస్తూ కనిపిస్తున్నారు. దీంతో నెటిజన్లు, బిజెపి శ్రేణులు దానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.