Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు పోలింగ్ వేళ ఈటలతో భేటీ ప్రచారం ... కర్నె ప్రభాకర్ క్లారిటీ

నల్గొండ : మునుగోడు ఉపఎన్నికలో అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పందించారు. 

First Published Nov 3, 2022, 9:02 AM IST | Last Updated Nov 3, 2022, 9:02 AM IST

నల్గొండ : మునుగోడు ఉపఎన్నికలో అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పందించారు. బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తాను భేటీ అయినట్లుగా జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని... తాను టీఆర్ఎస్ పార్టీని వీడబోనని ప్రభాకర్ స్పష్టం చేసారు. మునుగోడులో బిజెపి ఓటమి ఖాయమైన నేపథ్యంలోనే ఇలాంటి దౌర్భాగ్యపు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ఎవ్వరూ నమ్మవద్దని సూచించారు. కేసీఆర్ సంక్షేమ అభివృద్ది పథకాలకు బిజెపి పంచుతున్న డబ్బుకట్టలకు మధ్యే మునుగోడు పోటీ జరుగుతోందని కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు.