జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో గ్యాంగ్ రేప్...: టిపిసిసి చీఫ్ రేవంత్ సంచలనం
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ రేప్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ రేప్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం గురించి మాట్లాడిన బిజెపి నాయకులు... హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలొ గ్యాంగ్ రేప్ జరిగితే ఎందుకు మాట్లాడలేరని ప్రశ్నించారు. ఎఐంఎం నాయకుల పిల్లలు పెద్దమ్మతల్లి గుడి ప్రాంగణంలో గ్యాంగ్ రేప్ కు పాల్పడితే హిందూ మతానికి వారుసులుగా చెప్పుకునే బిజెపి నరాయకులు పల్లెత్తి మాట అనలేదు... ఇంత కంటే దుర్మార్గం వుంటుందా అని అన్నారు. ఆ సమయంలో ఎలాంటి ఉపఎన్నికలు లేవు కాబట్టి రాజకీయ ప్రయోజనాలు అవసరంలేదు... అందుకే బిజెపి నాయకులు ఈ రేప్ కేసు గురించి పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.