రాజన్న ఆలయ ఈవో సస్పెషన్ష కు బిజెపి డిమాండ్... నేడు వేములవాడ బంద్
వేములవాడ : తెలంగాణలోని ప్రముఖ శైవ దేవాలయమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఈవో తీరును బిజెపి తప్పుబడుతోంది.
వేములవాడ : తెలంగాణలోని ప్రముఖ శైవ దేవాలయమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఈవో తీరును బిజెపి తప్పుబడుతోంది. ఆలయ ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ (గురువారం) వేములవాడ పట్టణ బంద్ కు బిజెపి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆలయ పరిసరాల్లోకి చిరు వ్యాపారులతో పాటు పట్టణంలోని విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్చందంగా బంద్ చేపట్టాయి. బిజెపి నాయకులు రాజన్న ఆలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సదర్భంగా సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆలయ ఈవోపై తీవ్ర ఆరోపణలు చేసారు. దర్శనంతో పాటు సేవల రేట్లను పెంచుతూ స్వామివారిని పేదలకు దూరంచేస్తూ ధనికులకు దగ్గర చేస్తున్నారని ఆరోపించారు. ఆలయంలోకి స్థానికులను రాకుండా, స్వామివారి దర్శనం కల్పించకుండా ఈవో అన్యాయంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. చివరకు కేంద్ర మంత్రి దర్శనానికి వచ్చినా ప్రొటో కాల్ పాటించలేదని ప్రతాప రామకృష్ణ అగ్రహం వ్యక్తం చేసారు.