కార్తీక పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ... మూతపడ్డ భద్రాచలం, వేములవాడ ఆలయాలు
హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి పర్వదినానే పాక్షిక చంద్రగ్రహణం వుండటంతో నేడు హిందూ దేవాలయాలు మూతపడుతున్నాయి.
హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి పర్వదినానే పాక్షిక చంద్రగ్రహణం వుండటంతో నేడు హిందూ దేవాలయాలు మూతపడుతున్నాయి. ఇలా తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు భద్రాచలం రామాలయం, వేములవాడ రాజన్న ఆలయాలు ఇప్పటికే మూతపడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామచంద్రమూర్తి ఆలయాన్ని అర్చకులు ఉదయం 7.30 నిమిషాలకే మూసివేసారు. తిరిగి రాత్రి 7.30 నిమిషాలకు ఆలయ తలుపులు తెరిచి సంప్రోక్షణ అనంతంగా భక్తుల దర్శనాన్ని పున:ప్రారంభించనున్నారు. ఇక వేములవాడ రాజరాజేశ్వర స్వామికి తెల్లవారుజామునే సుప్రభాతం అనంతరం ఉదయం 6 గంటలకే అర్చకులు, అధికారులు మూసేసారు. ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా మూసేసారు. గ్రహణం అనంతరం తిరిగి రాత్రి 8.30 నిమిషాలకు ఆలయాన్ని తెరిచి జ్వాలాతోరణ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు భద్రాద్రి, కొండగట్టు, చిల్కూరు బాలాజి ఆలయాలు కూడా గ్రహణం సందర్భంగా నేడు మూతపడుతున్నాయి.