Asianet News TeluguAsianet News Telugu

తొమ్మిదేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్... నిందితుల్లో మైనర్ బాలుడు

ఈ నెల 24న కరీంనగర్ పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లో మూడో తరగతి చదువుతున్న అభం శుభం తెలియని 9 ఏళ్ల చిన్నారి ఆటాడుకుందామని నమ్మించి ముగ్గురు వ్యక్తులు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

ఈ నెల 24న కరీంనగర్ పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లో మూడో తరగతి చదువుతున్న అభం శుభం తెలియని 9 ఏళ్ల చిన్నారి  ఆటాడుకుందామని నమ్మించి ముగ్గురు వ్యక్తులు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం చిన్నారిని ఇంటి దగ్గర వదిలి వెళ్లారు.  ఉదయం చిన్నారి కడుపు నొప్పి రావడంతో  తల్లి ఆరా తీయగా..చిన్నారి అసలు విషయాన్ని చెప్పింది. దీంతో చిన్నారి తల్లి కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు  చిన్నారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ  ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల్లో ఒకరు మైనర్ కాగా, మిగిలిన ఇద్దరు మేజర్లేనని పోలీసులు తెలిపారు.

Video Top Stories