డివైడర్ ను దాటుకుని కారుపైకి దూసుకెళ్లిన లారీ... భార్యభర్తలు సహా ముగ్గురు మృతి

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నకోడూరు మండలం మల్లారం స్టేజి వద్ద గల మైసమ్మ టెంపుల్ ఆవరణలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

First Published Jun 12, 2022, 1:20 PM IST | Last Updated Jun 12, 2022, 1:20 PM IST

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నకోడూరు మండలం మల్లారం స్టేజి వద్ద గల మైసమ్మ టెంపుల్ ఆవరణలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. రోడ్డు మధ్యలోని డివైడర్ ఢీకొట్టి అవతలివైపు దూసుకెళ్లిన లారీ కారును గుద్దింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న బార్యాభర్తలతో పాటు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. కారుపైకి లారీ అమాంతం దూసుకెళ్లడంతో నుజ్జునుజ్జయ్యింది. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను కారులో నుండి బయటకు తీసారు. అనంతరం వాటిని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.