జగిత్యాల జిల్లాలో విషాదం... చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలోని విషాదం చోటుచేసుకుంది.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలోని విషాదం చోటుచేసుకుంది. ఎండలు మండిపోతుండటంతో సరదాగా స్నానానికి చెరువులో దిగిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటమునిగి దుర్మరణం చెందారు. మృతిచెందిన విద్యార్థులుగా మారంపలి శరత్ (6వ తరగతి, వయస్సు 14 సంవత్సరాలు), పబ్బం నవదీప్ (4వ తరగతి వయస్సు 14 సంవత్సరాలు), గోలుసుల యశ్వంత్ (4 వ తరగతి వయసు 13 సంవత్సరాలు) గుర్తించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బందువుల రోదనలు మిన్నంటాయి.