భాగమతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో దట్టమైన పొగలు.. పెద్దపల్లిలో ఆగిన ట్రైన్..
యాంకర్ :- మైసూర్ నుండి దర్భంగా వెళుతున్న భాగమతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి.
యాంకర్ :- మైసూర్ నుండి దర్భంగా వెళుతున్న భాగమతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ట్రైన్ పైలెట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పెద్దపల్లి, రామగుండం స్టేషన్ల మధ్య ఈ పొగలు వ్యాపించడంతో ట్రైన్ ను పెద్దపల్లి స్టేషన్ కు తరలించారు. అప్పటికే పెద్దపల్లి రైల్వే స్టేషన్లో సిద్ధంగా ఉన్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ట్రైన్ ఇంజన్లోని పొగలను ఆర్పివేశారు. దీంతో ప్రయాణికులతో పాటు రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపల్లి రైల్వేస్టేషన్లో ట్రైన్ ను 40 నిమిషాలపాటు నిలిపివేసి.. రామగుండం రైల్వే జంక్షన్ నుండి మరో ఇంజన్ తెప్పించి ట్రైన్ ను పంపించారు.