రూపాయి నోట్ తీసుకురండి.. బిర్యానీ తీసుకెళ్లండి...
కరీంనగర్ పట్టణ కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన బిర్యాని సెంటర్ నిర్వాహకులు వినూత్నంగా ఒక్క రూపాయి నోట్ తో రండి బిర్యానీ తీసుకెళ్లండి అంటూ ఒక ప్రత్యేక ఆఫర్ పెట్టారు.
కరీంనగర్ పట్టణ కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన బిర్యాని సెంటర్ నిర్వాహకులు వినూత్నంగా ఒక్క రూపాయి నోట్ తో రండి బిర్యానీ తీసుకెళ్లండి అంటూ ఒక ప్రత్యేక ఆఫర్ పెట్టారు. అయితే ఈ రోజుల్లో ఒక్క రూపాయి నోటు ఎక్కువగా చలామణిలో లేదు అని భావించిన నిర్వాహకులకు చుక్కెదురైంది. బిర్యానీ సెంటర్ నిర్వాహకుల ప్రకటన నిమిషాలలో దావాణంలా వ్యాపించడంతో ప్రజలు పెద్ద ఎత్తున రూపాయి నోట్లతో బిర్యాని సెంటర్ ముందు బారులు తీరారు. ఊహించని హఠాత్పరిణామంతో బిర్యానీ సెంటర్ నిర్వాహకులు ఖంగు తిన్నారు. ఇది ఇలా ఉండగా ప్రజలు బిర్యాని సెంటర్ కు పెద్ద ఎత్తున క్యూ కట్టడంతో పరిసర ప్రాంతంలో నిలిపిన వాహనాలకు పోలీసులు చాలాన్ లు విధించారు .