Asianet News TeluguAsianet News Telugu

ఓటమితో అధైర్యపడొద్దు: మంత్రి తలసాని (వీడియో)

ఎన్నికల లో గెలుపు, ఓటములు సహజమని, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధైర్య పడొద్దని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినీమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం  అంబర్ పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ స్థాయిలో వేరువేరుగా నిర్వహించిన సమావేశాలలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ తలసాని సాయి కిరణ్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు శ్రీ కాలేరు వెంకటేష్, శ్రీ ముఠా గోపాల్, మాజీమంత్రి శ్రీ నాయిని నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు, trs పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

ఎన్నికల లో గెలుపు, ఓటములు సహజమని, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధైర్య పడొద్దని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినీమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం  అంబర్ పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ స్థాయిలో వేరువేరుగా నిర్వహించిన సమావేశాలలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ తలసాని సాయి కిరణ్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్,  ఎమ్మెల్యేలు శ్రీ కాలేరు వెంకటేష్, శ్రీ ముఠా గోపాల్, మాజీమంత్రి శ్రీ నాయిని నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ఇప్పటి వరకు బీజేపి, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే పోటీ చేశాయని చెప్పారు. కానీ మొదటి సారి టీఆర్ఎస్ పార్టీ నుండి అతి చిన్న వయసు కలిగిన సాయి కిరణ్ కు పోటీ చేసే అవకాశం ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కల్పించారని చెప్పారు. అయినప్పటికీ బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చామన్నారు. ఈ ఎన్నికల లో దేశ రాజకీయాలు ప్రభావితం చేశాయని చెప్పారు. రానున్న రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మంత్రి వివరించారు