Asianet News TeluguAsianet News Telugu

టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారం... బండి సంజయ్ అరెస్ట్..!

రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కావడం దుమారం రేపింది. 

First Published Apr 5, 2023, 9:30 AM IST | Last Updated Apr 5, 2023, 9:30 AM IST

రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కావడం దుమారం రేపింది. ఈ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. కరీంనగర్‌లోని బండి సంజయ్ నివాసానికి పోలీసులు వెళ్లారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  బండి సంజయ్ ఇంటికి వెళ్లిన పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు చివరకు బండి సంజయ్‌ను అరెస్టు చేశారు. ఆయనను హైదరాబాద్‌కు తరలించారు.