Asianet News TeluguAsianet News Telugu

రాజకీయ లబ్ది కోసమే టెన్త్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేపించారు : మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్

రాజకీయ లబ్ది కోసమే బండి సంజయ్ పదో తరగతి ప్రశ్నపత్నం లీక్ చేయించారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. 

First Published Apr 5, 2023, 4:55 PM IST | Last Updated Apr 5, 2023, 4:55 PM IST

రాజకీయ లబ్ది కోసమే బండి సంజయ్ పదో తరగతి ప్రశ్నపత్నం లీక్ చేయించారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన సంజయ్ ని బిజెపి అధ్యక్ష పదవి నుండి తొలగించడమే కాదు పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మంత్రి డిమాండ్ చేసారు. ప్రశ్నపత్రాల లీకేజీలో రాజకీయ పార్టీల పాత్ర వుండటం దురదృష్టకరమని జగదీశ్ రెడ్డి అన్నారు.   టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ చేయించి సంజయ్ అడ్డంగా దొరికిపోయినా ఈ వ్యవహారంలో ఆయనదేమీ తప్పు లేదు అన్నట్లుగా బిజెపి నాయకులు సమర్దించుకోవడం సిగ్గుచేటని అన్నారు. చట్టాన్ని అతిక్రమించి పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లి మరీ ఓ దొంగను తప్పించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీతో రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని బిజెపి కుట్రలు పన్నుతోందని జగదీశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు.